సిద్దిపేట, సెప్టెంబర్ 29: జిల్లాకేంద్రం సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సతీమణి శ్రీనిత ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. శ్రీనిత బతుకమ్మను పేర్చి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు.
ఎమ్మెల్యే సతీమణితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు, 5వ వార్డు కౌన్సిలర్ కొండం కవిత సంపత్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్‌రెడ్డి.. పలువురు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.