చిన్నకోడూరు, ఆగస్టు 25: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అల్లు డు చిన్నకోడూరుకు చెందిన జంగాపల్లి మణివర్మ గుండెపోటుతో సోమవారం మృతిచెందా డు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మం త్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మణివర్మ మృతదేహానికి నివాళులర్పించి ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పరామర్శించి ఓదార్చారు. అంత్యక్రియ ల్లో పాల్గొన్నారు.
మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఎదిగే వయస్సు కొడుకుని కోల్పోయి న తల్లిదండ్రులను ఓదార్చారు. అధైర్యపడొద్దని మనోధైర్యాన్ని ఇచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందంగౌడ్, బీఆర్ఎస్వై, బీఆర్ఎస్వీ నాయకులు ఉన్నారు.