నంగునూరు, మార్చి 23: సర్వ జగత్ రక్షకుడు ఆంజనేయ స్వామి… ఆ దేవుడి కృపతో అందరూ బాగుండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని వెంకటాపూర్‌లో హనుమాన్ దేవాలయాన్ని ఆయన దర్శించుకుని పూజలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్తులు దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించుకొని ప్రతిష్ఠ చేసుకోవడం సంతోషకరమన్నారు. ఆలయ నిర్వాహకులు, ప్రజలను అభినందించారు. హరీశ్‌రావును అర్చకులు ఆశీర్వదించగా నిర్వాహకులు సతరించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెంట మండల నాయకులు తదితరులు ఉన్నారు.