నంగునూరు, మార్చి 19 : మండుటెండల్లో కాళేశ్వరం నీళ్లతో కాల్వలు గలగలా పారుతూ రైతు పొలాలు పచ్చగా కనబడుతుంటే ఈ ఆనందం కంటే ఇంకేముందంటూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ తన్నీరు హరీశ్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మం డలం నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన రైతు మేళాను సందర్శించి తిరుగు ప్రయాణంలో వెంకటాపూర్ సమీపంలో కాళేశ్వరం కాల్వలో గోదావరి జలాల గలగలా పారుతుండడం గమనిం చి కాది దిగారు. కాల్వ ఒడ్డుకు చేరుకుని సెల్పీ తీసుకుని ఆనం దం వ్యక్తం చేశారు. అపర భగీరథుడు కేసీఆర్ కృషితో వేసవిలోనూ జలపరవళ్లు తొక్కుతున్నాయని, రైతుల కం డ్లలో ఆనందం, అంతులేని కనిపిస్తుందని ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, దేశపతి శ్రీనివాస్‌తో కలిసి సెల్పీ దిగి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.