సిద్దిపేట, అక్టోబర్ 1: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
అమావాస్య నుంచి తొమ్మది రోజులు ఆడపడుచులు కలిసి ఆడే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. దేశంలోనే పూల ను పూజించి ప్రకృతిని ప్రేమించే పండుగ అన్నారు. అలాంటి సంస్కృతి తెలంగాణలో ఉందన్నారు.