మెదక్, జూలై 9(నమస్తే తెలంగాణ): మెదక్ మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు అనుకూలంగా పని చేస్తున్నారని కొందరు దుండగులు పార్టీ కార్యకర్త హబీబ్ ఆటోను దగ్ధం చేశారు. దీంతో జీవనోపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ హబీబ్‌కు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీర్ హరీశ్‌రావు వాహన పత్రాలను గురువారం అందజేశారు. ఆటో డ్రైవర్ హబీబ్ జీవనోపాధికి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆర్థిక సాయంతో పాటు కొత్త ఆటోను అందజేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్‌లో బీఆర్ఎస్ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తామన్నారు. కార్యకర్త పరిస్థితిని చూసి స్వయంగా ఆటో కొని ఇచ్చినట్లు తెలిపారు. కార్యకర్తలు, నాయకులు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి ఆటో డ్రైవర్ హబీబ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సే న్, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, నాయకులు కృష్ణాగౌడ్, జీవన్‌రావు, నరేందర్, బట్టి ఉదయ్‌కుమార్, జుబేర్, అహ్మద్, దీపక్‌కుమార్, మాయ మల్లేశం, సాయి, కిరణ్ పాల్గొన్నారు.