చిన్నకోడూరు, జూలై 9: రేవంత్‌రెడ్డి రైతుల ఉసురు తీస్తున్నాడని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో ఫర్టిలైజర్ దుకాణాన్ని గురువారం మాజీ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొకజొన్న రైతుకు కనీసం నాలుగు బస్తాలు ఇవ్వాలి, కానీ ప్రభుత్వం సరిపడా ఎరువులు సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతి రై తుకు రెండు బస్తాలే ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువుల ధరలు విపరీతంగా పెంచడంతో రైతుకు పెనుభారంగా మారిందన్నారు. యాప్ రద్దు చేసి నేరుగా యూరియాను రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎంత యూరియా అవసరమైతే అంత సరఫరా చేయాలన్నారు.
సిద్దిపేట జిల్లా రైతులకు ఆయిల్ పామ్ మొక లు అందించాకే ఇతర జిల్లాలకు పంపాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్‌లోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ కింద పెంచుతున్న ఆయిల్ పామ్ నర్సరీని మాజీ మంత్రి హరీశ్‌రావు సందర్శించారు. జిల్లా ఆయిల్ ఫెడ్ అధికారి భాసర్రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. జిల్లాలోని ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సరిపడా మొకలు అందించారా.. అందించక ముందే ఇతర జిల్లాలకు పంపడం ఏమిటని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా రైతులకు మొకలు అందించాలి. వెంటనే ఇతర జిల్లాలకు వెళ్లే లారీలు ఆపాలని హరీశ్‌రావు ఆదేశించారు. నర్సరీల నిర్వహణ సరిగా లేదని, మొకల్లో ఇసుక ఉందని నీళ్లు సరిగా పట్టడం లేదన్నారు.
చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ వెళ్లే క్రమంలో పెద్దకోడూరు పరిధిలో తిరుపతి పొలంలో నాట్లు వేస్తున్న మహిళా కూలీలను చూసి, ఆగి హరీశ్‌రావు మాట్లాడారు. మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా నుంచి ఇకడికి నాట్లు వేయడానికి మహిళలు కూలీ పనికి వచ్చారని, రైతు చెప్పగానే కారులోని నుంచి దిగి నాట్లు వేస్తున్న మహిళా కూలీలతో ముచ్చటించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, పార్టీ మండల అధ్యక్షుడు కామిని శ్రీనివాస్, అల్లిపూర్ సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాపయ్య, గంగాపూర్ సొసైటీ మాజీ చైర్మన్ కనకరాజు, మాజీ ఎంపీటీసీ దుర్గారెడ్డి, చంద్రమౌళి, నాయకులు వెంకట్ రెడ్డి, రాచకొండ లింగం, రాచకొండ భిక్షపతి పాల్గొన్నారు.