రామాయంపేట, పిబ్రవరి 9 : ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు వేసి మోసం చేసిన పాపాత్ముడు రేవంత్‌రెడ్డి అని, ఇలాంటి దుర్మార్గులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. సోమవారం మెదక్ జిల్లా రామాయంపేటలో కార్నర్ మీటింగ్‌లో ఆయ న పాల్గొన్నారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కలిసి భారీ ర్యాలీగా మెదక్ చౌరస్తా వద్దకు చేరుకుని కార్న ర్ మీటింగ్‌లో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటైనా అమలు చేశావా అని సీఎం రేవంత్‌ను హరీశ్‌రావు ప్రశ్నించారు.
సీఎంకు దమ్ముంటే రామాయంపేటకు వస్తే తాము చేసిన అభివృద్ధి చూపెడతామన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించమని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు వింటూ బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే పోలీసులపై చర్యలు తీసుకుంటామని, మీ నట్లు, బోల్టులు టైట్ చేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు.

బీఆర్ఎస్ హయాంలో మెదక్ జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులిచ్చామని హరీశ్‌రావు అన్నారు. అభివృద్ధి, సం క్షేమం, ఆరుగ్యారెంటీలు, హామీలు విస్మరించిన కాంగ్రెస్‌కు ఎన్నికల్లో ఓడించి బుద్దిచెప్పాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
రామాయంపేటలో కాంగ్రెస్ గూండాగిరీ నడవదని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి హెచ్చరిచారు. తండ్రీకొడుకుల ఆటలు ఇక సాగవన్నారు. రామాయంపేట, మెదక్, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలపై గులాబీజెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశా రు. కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు దిగితే ప్రజలు ఓట్లు వేయరన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి,

నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మున్సిపల్ ఇన్చార్జి రవీందర్‌రెడ్డి, నాయకులు పల్లె జితేందర్‌గౌడ్, పుట్టి యాదగిరి,చౌదరి సుప్రభాతరావు, అందె కొండల్‌రెడ్డి, బాదె చంద్రం, బిజ్జ సంప త్, సుధాకర్‌రెడ్డి, ఉమా మహేశ్వర్, ఐలయ్య, విద్యాకర్ రాజు, అబ్దుల్ అజీజ్, పాకాల చంద్రశేఖర్‌రావు, వెంకటస్వామి, కౌన్సిలర్ అభ్యర్థులు పుట్టి విజయలక్ష్మి, ప్రభావతి, చరిత చౌదరి, మాధవి, మల్లేశం, శ్రీనివాస్ నాయక్, జొన్నల బాలు,మద్దూరి భాను,పాతూరి సాయికుమార్,ఎర్రం చంద్రం తదితరులు పాల్గొన్నారు.