సిద్దిపేట ప్రజలు మంచివాదని, ఇక్కడి ప్రజలు సహకరిస్తారన్న పేరు వస్తే భవిష్యత్తులో మరింత మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ఇకడికి వస్తారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇకడ పుషలంగా నీళ్లు రావడంతో వాతావరణం లో తేమ శాతం పెరిగి పామాయిల్ తోటల సాగుకు అనుకూలంగా మారిందన్నారు.
బయోగ్యాస్ ప్లాంట్‌కు పరోక్షంగా కాళేశ్వరం ప్రాజెక్టే కారణమన్నారు. ఈ పరిశ్రమ ద్వారా స్థానికంగా 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుందన్నారు. మన ఏరియా అభివృద్ధి చెందడానికి, రైతులకు మేలు చేయడానికి వచ్చిన ఈ పరిశ్రమ ఏర్పాటుకు రాజకీయాలకతీతంగా ప్రజలందరూ సహకరించాల ని కోరారు. ఇరాన్-అమెరికా యుద్ధ వా తావరణంతో పెట్రో, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడి ఎకానమీ దెబ్బతింటుందని భయా ందోళనలు నెలకొన్నాయన్నారు.
మన దేశానికి అవసరమైన గ్యాస్‌లో 50 శాతానికి పైగా విదేశాల నుం చే దిగుమతి చేసుకుంటున్నామని, యుద్ధా ల వల్ల గ్యాస్ పైప్లైన్లు దెబ్బతిని సరఫరా నిలిచిపోతే ప్రజలు ఇబ్బందులు పడుతారన్నారు. విపతర పరిస్థితులను, గ్లోబల్ షార్టేజ్‌ను ఎదురోవాలంటే మన దేశం ఇంధనరంగంలో స్వ యం సమృద్ధి సాధించి దిగుమతులను తగ్గించుకోవాలంటే ఇలాంటి బయోగ్యాస్ ప్లాంట్లు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రాధాన్యత ఉన్న ప్లాంట్‌ను ధైర్యంగా స్థాపిస్తున్న పారిశ్రామికవేత్త రాయపాటి శరత్‌కు హరీశ్‌రావు అభినందనలు తెలిపారు.