సిద్దిపేట టౌన్, జూన్ 6: పద్మశాలీలు ఐక్యంగా ఉండి సంఘ అభివృద్ధ్దికి కృషి చేసుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేట పట్టణ పద్మశాలి సమాజం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారణ మహోత్సవం పట్టణంలోని మార్కండేయ ఆలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరై నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ..పద్మశాలీల అభివృద్ధ్దికి సంఫూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
పేదరికంలో ఉన్న పద్మశాలీలకు తన వంతు సహాయ, సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. మార్కండేయ ఆలయ అభివృద్ధ్దికి పాటుపడుతామన్నారు. మినీ ఫంక్షన్‌హాల్‌కు సహకారం అందిస్తానన్నారు. పద్మశాలీలు రాజకీయం గా, ఆర్ధికంగా, సామాజికం గా ఎదగాలని పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కస్తూరి సతీశ్ పిలుపునిచ్చారు.
పద్మశాలీ సమాజం అధ్యక్షుడు కాముని రాజేశం మాట్లాడుతూ..పద్మశాలీల అభివృద్ధ్దికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, సంఘం నేతలు గుండు భూపేశ్, బూర మల్లేశం, ముదిగొండ శ్రీనివాస్, కాముని నగేశ్, భిక్షపతి, అశోక్, రవితేజ, శ్రీహరి, నాగరాజు, ప్రసాద్, శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్, సంతోష్, నగేశ్, ప్రకాశ్, రాజ్‌కోటి ఆంజనేయులు, మహేశ్ పాల్గొన్నారు.