గజ్వేల్, మార్చి 24: దివాళా కోరు రాజకీయాలను సీఎం రేవంత్ మానుకోవాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హితవు పలికారు. సోమవారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్‌తో కేసీఆర్‌కు పేగుబంధం ఉందన్నారు. గతంలో ప్రజ్ఞాఫూర్ నుంచి గజ్వేల్ మూడు కిలోమీటర్ల రోడ్డుపై 36గుంతలు ఉండేవని, కేసీఆర్ సహకారంతో విశాలమైన నాలుగు వరుసల రోడ్డు వేశామన్నారు.
కేసీఆర్ కృషితో రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా గజ్వేల్ అభివృద్ధి చెందినట్లు తెలిపారు. కేసీఆర్ వచ్చాక ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందన్నారు. దేశ ప్రధానిని గజ్వేల్‌కు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దే అని, ఆయన చేతు ల మీదుగా మిషన్ భగీరథను ప్రారంభించి రాష్ట్రంలోనే తొలుత ఇక్కడే ఇంటింటికీ తాగునీరు అందించి దాహార్తిని తీర్చారన్నారు. నేడు కేసీఆర్ ప్రతి ఇంట్లో అక్కాచెల్లెళ్లకు మిషన్ భగీరథ నీటిలో ఉదయం పలకరిస్తున్నాడని, ఆనాడు ఖాళీ బిందెలతో ట్యాం కుల వద్దకు మహిళలు పరుగులు పెట్టేవారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ నీళ్లకు కోత పెట్టి సరిపడా సరఫరా చేయడం లేదని విమిర్శించారు.
సాగునీళ్లు రాక, కరెంట్ లేక ధైర్యం కోల్పో యి రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారని, కేసీఆర్ కృషితో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్మాణంతో గలగల పారే గోదావరి నీళ్ల రాకతో ఈ ప్రాంతం ధాన్యలక్ష్మిగా తాండవం చేస్తూ బంగారు పంటలు పండుతున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. భూముల ధరలు భారీగా పెరిగి రైతులకు పతారా పెరిగిందన్నారు. దరిద్రపు కాంగ్రెస్ పాలనలో ధాన్యలక్ష్మి మాయమైందన్నారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ ప్రాంతాల్లో పాఠశాలలు బూత్ బంగ్లాలుగా ఉంటే, కేసీఆర్ బ్రహ్మాండమైన భవనాలు కట్టడంతో సరస్వతి నిలయాలుగా మారాయని, యూనివర్సిటీ, కార్పొరేట్ పాఠశాలతో పోటీపడేలా ఎడ్యుకేషన్ హబ్, అటవీ కళాశాల, హార్టికల్చర్ విశ్వవిద్యాలయం, గురుకుల పాఠశాలలతో గజ్వే ల్ ప్రాంతాన్ని తీర్చిదిద్దినట్లు గుర్తుచేశారు. గోదావరి నీళ్లు గజ్వేల్ పాండవుల చెరువుకు చేరాయని, ఆనాడు ఈ చెరువు విడాకుల పంచాయితీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేదని, ఇప్పుడు పిల్లలు ఆడుకునేందుకు అనువైన పర్యాటక ప్రాంతంగా మారిందన్నారు.
గజ్వేల్‌లో జరిగిన అసాధారణ ప్రగతిలో కేసీఆర్ కనబడుతారని హరీశ్‌రావు అన్నారు. ఏ ఊరికి పోయినా రోడ్ల పక్కన పచ్చని చెట్లలో కేసీఆర్ కనిపిస్తాడన్నారు. గజ్వేల్ చుట్టూ విస్తరించిన బైపాస్‌రోడ్డు, మహతి ఆడిటోరియం, వెజ్ నాన్ వెజ్ మార్కెట్, పాతూర్ వద్ద మార్కెట్ నిర్మాణంతో ఎంతోమంది రైతులు బతుకుతున్నట్లు తెలిపారు. గజ్వేల్‌లకు రైలు కలను సాకారం చేసి, జిల్లా రైతులకు నిరంతరం ఎరువులు దొరికేలా రేక్ పాయింట్‌ను ఏర్పాటు చేయించారన్నారు. వేల కోట్లతో కేసీఆర్ చేసిన అభివృద్ధే ప్రజల కండ్ల ముందు కనిపిస్తున్నదన్నారు.
గజ్వేల్‌పై కేసీఆర్ కన్న తండ్రి ప్రేమ చూపిస్తే , రేవంత్‌రెడ్డి సవతితల్లి ప్రేమ చూపిస్తున్నాడని విమర్శించారు. గజ్వేల్‌కు మంజూరైన రూ.181 కోట్ల పనులను తిరిగి మంజూరు చేయాలని సీఎం రేవంత్‌ను హరీశ్‌రావు డిమాండ్ చేశా రు. 15 నెలల కాంగ్రెస్ కాలంలో గజ్వేల్‌లో రూపాయి పని చేశావా అని సీఎంను ప్రశ్నించారు. కేసీఆర్ గర్జిస్తేనే మల్లన్నసాగర్ గేట్లు తెరిచావని, తెలంగాణ అల్లాడుతుందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ అంటే రైతుబంధు అని, రేవంత్ రైతుబంధును మింగిన రాబంధు అని విమర్శించారు. సగంమందికి కూడా రుణమాఫీ కాలేదన్నారు. కేసీఆర్‌పై మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదని విమర్శించారు. ఒకనాడు గజ్వేల్ గ్రామంలా ఉండేదని, కరువు, తాగునీటికి కటకట ఉండేదన్నారు. గజ్వేల్ దశదిశామార్చడని, ఇవాళ సకల వసతులతో ఆదర్శ పట్టణంగా మారిందని హరీశ్‌రావు అన్నారు.
మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాలకు కేసీఆర్ ప్రభుత్వం రూ.1260 కోట్ల పరిహారం ఇచ్చిందని, మిగిలిన రూ.200 కోట్ల పరిహా రం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముం దుకు రావడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. అసెంబ్లీలో ఈనెల 26న ఇరిగేషన్‌పై ‘కట్ మోషన్’లో మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని తెలిపారు. గతంలో రేవంత్‌రెడ్డి మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాల పక్షాన చేసిన నిరాహార దీక్ష నటన అని, అదే నిజమైతే వారి సమస్యలు త్వరగా పరిష్కరించాలన్నారు. అప్పుడేమో తక్కువ పరిహారం ఇసుస్తున్నారని విమర్శించిన నీవు, ఇప్పుడు రెట్టింపు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ మధ్యనే కొంతమంది కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారని, వారి సమస్యలు త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వం టేరు ప్రతాప్‌రెడ్డి, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మ న్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, నాయకులు దేవీ రవీందర్, రాజమౌళి, అంజిరెడ్డి,జుబేర్‌పాషా, బెండే మధు, జేజాల వెంకటేశంగౌడ్, పాం డుగౌడ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.