గుమ్మడిదల, జూన్ 2: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల సర్వే నెంబర్ 109 భూమి విషయంలో బాధిత రైతులకు అండగా ఉంటానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు సోమవారం హైదరాబాద్‌లో హరీశ్‌రావును కలిసి తమ సమస్యలు వివరించారు. రైతుల ఆవేదన విన్న ఆయన వెంటనే కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒకో రైతుకు 600 గజాల భూమి ఇవ్వాలని నిర్ణయించామని, దాని విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని నేటి ప్రస్తుత విలువ రూ.2 కోట్లు ఉంటుందన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా లగచర్లలో రైతులకు పరిహారం చెల్లించి ఉద్యోగాలు ఇచ్చినట్లు, అదే తరహాలో గుమ్మడిదల రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. ప్రస్తుత ప్రభుత్వం పరిహారం విషయమై గ్రామ పంచాయతీలో మూడు రెట్లు, మున్సిపల్ పరిధిలో రెండు రెట్లు ఇవ్వాలని చెబుతున్నదని అధికారులు వెల్లడించారు.
కార్యక్రమంలో పటాన్చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు బాల్‌రెడ్డి, వెంకటేశంగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, రాజేశ్, నాయకులు బాలకృష్ణారెడ్డి దేవేందర్‌రెడ్డి, రాజశేఖర్, మంగయ్య, మల్లేశ్‌గౌడ్, సదానందరెడ్డి, సత్యనారాయణ, రవీందర్‌రెడ్డి ఆంజనేయులు యాదవ్, సూర్యనారాయణ, చంద్రారెడ్డి, సుధాకర్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి, మల్లేశ్, మోహన్, బీరప్ప, నారాయణయాదవ్, పెంటయ్య, రాజు,రైతులు పాల్గొన్నారు.