సిద్దిపేట, నవంబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్ దీక్షా ఫలితం, అమరుల త్యాగాలతో నే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నా రు. ‘29 నవంబర్ 2009 చరిత్ర మలుపు తిప్పిన రోజు.. చారిత్రాత్మక రోజు.. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు.. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు. జూన్ 2 లేకపోతే తెలంగాణ ఎకడిది రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఎకడిది..? తెలంగా ణ వచ్చింది కాబట్టే సిద్దిపేట జిల్లా అయిం ది.. సిద్దిపేటకు గోదావరి జలాలు వచ్చా యి.. సిద్దిపేటకు రైలు వచ్చింది, మెడికల్ కాలేజీ వచ్చింది. దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారంగా తెలంగాణ ఎదిగింది’.. అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నా రు. గురువారం బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన సిద్దిపేటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన దీక్షాదివస్ సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు,దేశపతి శ్రీనివాస్, వంటేరు యాదవరెడ్డి, ఫరూఖ్ హుస్సేన్, వంటేరు ప్రతాప్‌రెడ్డి, వేలేటి రాధాకృష్ణ శర్మ, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆనాడు కేసీఆర్ దీక్ష ప్రారంభించిన నాడు మనం కూడా సిద్దిపేటలోని పాత బస్టాండ్ వద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తుచేశారు. మొత్తం 1531 రోజులు దీక్షా శిబిరం కొనసాగినట్లు తెలిపారు. దీక్షలో కులమతాలకు అతీతంతగా ప్రజలు పాల్గొన్నారన్నారు. ఆ శిబిరానికి గుర్తుగా.. చిహ్నంగా ఒక పైలాన్ ఏర్పాటు చేసుకున్నట్లు హరీశ్‌రావు గుర్తుచేశారు. ప్రస్తుత మోడల్ బస్టాండ్ నిర్మాణంతో దాన్ని తీశామని, మళ్ల పెడదామంటే ఆర్టీసీ సంస్థ అనుమతి ఇవ్వడం లేదన్నారు. నాలుగేండ్ల పాటు సిద్దిపేటలో దీక్షా శిబిరం నడిపించుకున్నామని, ఆ ఉద్యమ జ్ఞాపకాల కోసం క్యాం పు ఆఫీస్ ముందు ఆ పైలాన్ ఏర్పాటు చేసుకోబోతున్నామని హరీశ్‌రావు చెప్పారు. దీక్షా దీవస్ రోజున సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి పార్టీ క్యారాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిద్దామని హరీశ్‌రావు చెప్పా రు. తొలుత సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద అంబేదర్ విగ్రహానికి పూలమాల వేసి దీక్షా దివస్‌ను ప్రారంభించుకుందామని క్యాడర్‌కు సూచించారు.

అకడి నుంచి కోటిలింగాల వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి వందనం సమర్పించి, ముస్తాబాద్ చౌరస్తాలో జయశంకర్ సార్ విగ్రహనికి పూలమాల వేసి, పాత బస్టాండ్ మీదుగా క్యాంప్ ఆఫీస్ వద్ద పైలాన్ శంకుస్థాపన చేసుకుందామన్నారు.అక్కడి నుంచి రంగధాంపల్లి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి, అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకుంటామని హరీశ్‌రావు చెప్పారు. అక్కడ ఏర్పాటు చేసిన ఉద్యమ ఫొటోగ్యాలరీ తిలకిద్దామన్నారు. మీ దగ్గర ఇంకా అరుదైన ఫొటోలు ఉంటే క్యాంపు ఆఫీస్‌లో అందించాలని పార్టీ క్యాడర్‌కు హరీశ్‌రావు సూచించారు. ఆ రోజు అమరుల కుటుంబాలను సన్మానం చేసుకుందామన్నా రు. పార్టీ శ్రేణులు, అభిమానులు స్పందించి తెలంగాణ ఉద్యమకారులను తీసుకోని రావాలని హరీశ్‌రావు కోరారు.
దీక్షా దీవస్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని బీఆర్ఎస్ సిద్దిపేట జిలా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రం కోసం 60 ఏండ్లుగా ఎన్నో ఉద్యమాలు జరిగినట్లు గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రె స్, బీజీపీ నాయకులు పాత్ర శూన్యమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కరుడ గట్టిన ఉద్యమకారుల మూలంగానే తెలంగాణ సాధించుకోవడం జరిగిందన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో ముందు వరుసలో నిలిపారన్నారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు నిధులు లేక గ్రామాలు వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్షా దీవస్‌ను విజయవంతం చేయాలని పార్టీ క్యాడర్‌కు కొత్త ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపునకు దీక్షా దీవస్ శ్రీకారం చుట్టిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు మార్గమైందని దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ కరీంనగర్ నుంచి సిద్దిపేటకు బయలుదేరగా అప్పటి సమైక్య ప్రభుత్వం అరెస్ట్ చేసినట్లు గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, నాయకులు మాట్లాడారు.