సిద్దిపేట, జనవరి 13: ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలందరికీ మకర సంక్రాంతి సందర్భంగా మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలన్నారు.
ఈ సంక్రాంతి ప్రతిఒకరి జీవితాల్లో నూతన కాంతిని తీసుకురావాలని ఆకాంక్షించారు.. ప్రజలందరూ సుఖసంతోషాలతో సుభిక్షంగా, పసిడి పంటలతో పరిఢవిల్లాలని భగవంతుడిని వేడుకున్నానన్నారు. చిన్నారులు ఎగురవేసే పతంగుల పట్ల తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.