సిద్దిపేట, జనవరి 11: సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్‌లో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు గల్లంతై మృతి చెందడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు అకాల మరణం మనసును కలిచివేసింది అన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని ఆయన తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పండుగ వేళ బిడ్డల్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఈ కుటుంబాలకు ప్రభుత్వం రు.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.