సిద్దిపేట, మార్చి 22 : సిద్దిపేట రైతులందరికీ పంట రుణమాఫీ చేశామన్న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మాటలు ఉట్టివేనని మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ బండారాన్ని బట్టబయలు చేశారు. శనివారం బడ్జెట్‌పై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట రైతులందరికీ రుణమాఫీ చేశామన్న మంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యల్లో డోల్లతనాన్ని ఎత్తిచూపారు. రాష్ట్రంలో పంట రుణమాఫీ అనేది అదొక దారుణ విషాద గాథ అన్నారు.
స్టేట్ లెవల్ బ్యాంకర్ల మీటింగ్‌లో సంపూర్ణ రుణమాఫీకి కావాల్సింది రూ.49,500 వేల కోట్లుగా తేల్చారని, ఒక సంవత్సరం అవినీతి చేయకుండా కడుపు కట్టుకుంటే రూ. 41 వేల కోట్లు ఒక దెబ్బకు మాఫీ చేయొచ్చని సీఎం రేవంత్‌రెడ్డి భారీ డైలాగులు దం చారని, భట్టి విక్రమార్క గత బడ్జెట్ ప్రసంగంలో రూ. 31వేల కోట్ల రుణమాఫీ చేస్తామని ఘనంగా ప్రకంటించి, ఈ బడ్జెట్ లోనే మో రూ.20 వేల కోట్లు ఇచ్చాం అంటున్నారని హరీశ్‌రావు విమర్శించారు. కానీ, వాస్తవానికి రూ. 16 వేల కోట్ల రుణమాఫీ కూడా ప్రభుత్వం చేయలేదన్నారు. మరి కడుపు కట్టుకోలేదో, అవినీతి ఆకలి ఆపుకోలేదో ప్రభుత్వానికే తెలియాలని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.
సిద్దిపేట నియోజకవర్గంలో బ్యాంకుల్లో పంటరుణం తీసుకున్న రైతులు 43,363 మంది ఉండగా, రుణమాఫీ కేవలం 20,514మంది రైతులకు మాత్రమే అయ్యిందన్నారు. రుణమాఫీ కాని రైతులు 22,849 ఉండగా, ఇందులో రూ.2లక్షలలోపు కానివారు 10,212 రైతులు ఉన్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఫైనల్‌గా రుణమాపీ అయిన రైతుల సంఖ్య తకువ, రుణమాఫీ కాని రైతుల సంఖ్య ఎకువన్నారు.
రూ.2లక్షల కంటే ఎకువ రుణం ఉన్న వారు మీదున్న రుణం కట్టండి, మిగతాది మాఫీ చేస్తానని సీఎం ప్రకటించడంతో ఆయన మాటలు నమ్మి చాలామంది రైతులు అప్పుతెచ్చి పైసలు కట్టినట్లు హరీశ్‌రావు గుర్తుచేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని గుర్రాలగొందిలో దమ్మర్పల్లి శ్రీనివాస్‌రెడ్డి అనే రైతు యూబీఐ బ్యాంకులో ఆగస్టు 30న రూ. 50వేలు కట్టాడని, నారాయణరావుపేటకు చెందిన జి.సత్తిరెడ్డి అనే రైతు రూ.2.60లక్షల రుణం ఉంటే, మిత్తితో కలిపి యూబీఐ బ్యాంకులో లోన్ ఉంటే, అందులో రూ.76 వేలు కట్టిండని హరీశ్‌రావు తెలిపారు.
బంజేరుపల్లికి చెందిన మరో రైతు అక్తర్ ఖుస్రో రూ.2,00,600 అప్పు ఉంటే, మిత్తితో కలిపి మీదున్న రూ.10వేలు కట్టిండని, ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నో అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ రోజువరకూ వారికి రుణమాఫీ కాలేదన్నారు. వారికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చెప్పాలన్నారు. రుణమాఫీపై చర్చకు మీ మధిరకు పోదామా? లేదా మా సిద్దిపేటకు వస్తారా? అని మంత్రిని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామో మీరే చెప్పాలని, వంద శాతం రుణమాఫీ జరిగి ఉంటే క్షమాపణలు చెప్పడానికి తాను సిద్ధమని, మీరు సిద్ధ్దమా?… మంత్రి భట్టి విక్రమార్కను హరీశ్‌రావు ప్రశ్నించారు.