సిద్దిపేట కమాన్, ఏప్రిల్ 13: కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టిజన్లను విస్మరించడం తగదని, వెంటనే వారితో చర్చలు జరిపి వారి సమస్యలు,డిమాండ్లను పరిష్కరించాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాం డ్ చేశారు. సిద్దిపేటలోని విద్యుత్ డీఈ కార్యాలయం వద్ద తమ సమస్యలను పరిషరించాలని డిమాం డ్ చేస్తూ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు 6 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు సోమవారం హరీశ్‌రావు హాజరై సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం వస్తుందని రేవంత్‌రెడ్డి అన్నివర్గాలకు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర ఏండ్లలో ఏ వర్గానికి మేలు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ 26 వేల మందిని ఆర్టిజన్లుగా గుర్తించి, మంచి వేతనం అందించినట్లు తెలిపారు.
సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తే వారి వద్దకు వెళ్లిన రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చాయ్ తాగినంత సేపట్లో మీ సమస్యను పరిషరిస్తామని హామీ ఇచ్చాడని, తీరా మొండిచేయి చూపాడని విమర్శించారు. సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులతో పాటు ఉపాధి హామీ ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశ వరర్లను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.