సిద్దిపేట, జూలై 9: కమీషన్ల మీద ఉన్న యావ కాంగ్రెస్ సర్కారుకు ప్రజా సంక్షేమంపై లేదని మా జీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కాళేశ్వరం నుంచి వచ్చే గోదావరి జలా లు ప్రజల కండ్లకు కనబడుతున్నాయని, రేవంత్ రెడ్డి కండ్లకు మాత్రం కనబడడం లేదా అని ఆయన ఎద్దేవా చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పటేల్ గార్డెన్లో సిద్దిపేట లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ వారికి ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ నిత్యం కాలువలు, కెనాల ద్వారా ప్రజలకు సాగు, తాగునీరు అందుతున్నా, రేవంత్‌రెడ్డి మాత్రం కాళేశ్వరం కూలిపోయిందని తప్పు డు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. రాజకీయంగా బీఆర్ఎస్పై బురద చల్లడమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తున్నదన్నారు. అసత్య ఆరోపణలు చేస్తున్న రేవంత్‌రెడ్డిని పిచ్చాసుపత్రిలో చేర్పించాలని అన్నారు. కాళేశ్వరం జలాలు సిద్దిపేటకు రావడంతోనే భారీగా పంట పండిందని, ధాన్యం నిల్వ ఉంచడానికి గోదాములు నిండిపోయి, తరలించడానికి లారీలు కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. సిద్దిపేటలో 6 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందన్నారు. కాంగ్రెస్ పాలన కమిషన్లతోనే కొనసాగుతున్నదన్నారు. గురుకులాల్లో కోడిగుడ్లు, బూట్లు, యూనిఫామ్‌లు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదాంట్లో కమీషన్లేనని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వాహనాల రేడియం స్టిక ర్లు అతికించడానికి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు.
గతంలో ఒక వాహనానికి రేడియం స్టికర్ చేస్తే రూ.వెయ్యి అయ్యేద ని, ప్రస్తుతం రూ.6 నుంచి 7వేల వరకు ఖర్చు అవుతున్నదన్నారు. లారీ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు డ్రైవర్స్, సి బ్బంది తప్పకుం డా ఎల్వీ ప్రసాద్ కం టి దవాఖాన సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రానున్నది బీఆర్ఎస్ సరారేనన్నా రు. కార్యక్రమంలో నాయకులు బీ ఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, రాధాకృష్ణశర్మ, లోక లక్ష్మీరాజం, పాల సాయి రాం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, మోహన్‌లాల్, అక్తర్ పటేల్, లియాఖత్, లైయిక్, సంజయ్‌కుమార్, బాబుజానీ పాల్గొన్నారు.