రోహిత్.. శభాష్
తనకు ఇంజినీరింగ్ సీటు ఇప్పించి కెరీర్లో నిలదొక్కుకునేలా సహకరించినందుకు రోహిత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి రుణం తీర్చుకోవడానికి ముందుకు వచ్చాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిపేట పట్టణానికి చెందిన శ్రీనివాస్, వనిత దంపతుల కుమారుడు రోహిత్‌కు విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ అండ్ టెక్నాలజీ (వీఎన్ఆర్) కళాశాలలో కంప్యూటర్ సైన్స్‌లో సీటు కోసం గతం లో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావును కలిసి విజ్ఞప్తి చేశారు.
- సాఫ్ట్వేర్ ఉద్యోగి రోహిత్‌ను అభినందించిన హరీశ్‌రావు
- ఆనాడు ఇంజినీరింగ్ సీటు ఇప్పించి కెరీర్‌కు సాయపడ్డ హరీశ్‌రావు
- అమెరికాలో ఉద్యోగం సాధించిన రోహిత్
- వేతనం నుంచి సమాజ సేవకు రూ.6 లక్షల విరాళం అందజేత
సిద్దిపేట, జూలై 11: తనకు ఇంజినీరింగ్ సీటు ఇప్పించి కెరీర్లో నిలదొక్కుకునేలా సహకరించినందుకు రోహిత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి రుణం తీర్చుకోవడానికి ముందుకు వచ్చాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిపేట పట్టణానికి చెందిన శ్రీనివాస్, వనిత దంపతుల కుమారుడు రోహిత్‌కు విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ అండ్ టెక్నాలజీ (వీఎన్ఆర్) కళాశాలలో కంప్యూటర్ సైన్స్‌లో సీటు కోసం గతం లో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావును కలిసి విజ్ఞప్తి చేశారు. అప్పట్లో హరీశ్‌రావు ఫోన్ చేసి అతనికి కళాశాలలో సీటు ఇప్పించాడు. చదువు ముగిసిన తర్వాత రోహిత్ రూ.12 లక్షల వార్షిక వేతనంతో అమెరికాలో బహుళ జాతి సంస్థలో ఉద్యోగం సాధించాడు.
సాయం పొంది మరిచిపోతున్న ఈ రోజుల్లో, తనకు హరీశ్‌రావు ఎంతో సాయం చేశారని గుర్తుచేసుకున్న రోహిత్ శనివారం సిద్దిపేటలో హరీశ్‌రావును కలిసి తన చదువుకు సాయం చేసిన విషయాన్ని గుర్తుచేశాడు. హరీశ్‌రావు మీద ఉన్న ప్రేమ, కృతజ్ఞతాభావంతో శనివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావును కలిసి తన వార్షిక వేతనంలో సగం రూ. 6లక్షలను సమాజ సేవా కార్యక్రమాలకు వినియోగించాలని హరీశ్‌రావుకు విరాళంగా అందించారు. దీంతో హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేసి రోహిత్‌ను అభినందించాడు.రోహిత్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయానికి హరీశ్‌రావు ఉద్వేగానికి లోనయ్యారు. రోహిత్ ఎందరికో ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా రోహిత్‌ను సన్మానించి అభినందించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

