సిద్దిపేట, ఫిబ్రవరి 11: సిద్దిపేట జిల్లాకేంద్రంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సూర్య నమసారాల పోటీల విజేతలను మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీశ్‌రావు అభినందించారు. సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన విజేతలకు చెకులు, మెడల్స్, జ్ఞాపికలు అందజేశారు.
సూర్య నమసారాల పోటీల్లో రికార్డ్ బ్రేక్ చేసిన వారితో ముచ్చటించారు. పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన పిల్లలను ఆశీర్వదించారు. జాతీయస్థాయిలో రాణించాలని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహక ప్రతినిధులు తోట సతీశ్, సంధ్య, కె.అంజయ్య, తోట అశోక్, నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, చిప్ప ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.