అందోల్, జూలై 7: మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అధ్యక్షతన నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని సంగుపేట లక్ష్మీనర్సింహ గార్డెన్లో సర్‌పై నియోజకవర్గస్థాయి బీఎల్ఏలు, పార్టీ శ్రేణులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ మండల, పట్టణ మాజీ అధ్యక్షులు లక్ష్మీకాంత్‌రెడ్డి, చాపల వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు.
బుధవారం ఉదయ 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. బీఎల్ఏలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, పార్టీ శ్రేణులు హాజరు కావాలని వారు సూచించారు.