పటాన్చెరు టౌన్, జూలై 23: ఓటు హక్కును కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ సర్‌లో భాగస్వాములు కావాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. సర్‌పై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 30 ప్రచార రథాలను గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆగస్టు 3వ తేదీలోపు తమ దరఖాస్తులను పూర్తి చేసి బీఎల్వోలకు అందజేయాలని సూచించారు. పటాన్చెరులో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నవారు తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గంలో తొమ్మిది డివిజన్లు, ఐదు మున్సిపాలిటీలు, రెండు మ ండలాల్లో ఎస్ఐఆర్పై ప్రచార రథాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీలు శ్రీకాంత్‌గౌడ్, కొలను బాల్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు శంకర్‌యాదవ్, కుమార్‌యాదవ్, అంజయ్యయాదవ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు వెంకటేశంగౌడ్, మున్సిపల్ చైర్మన్లు జనార్దన్, కుమార్‌గౌడ్, మాజీ ఎంపీపీలు దేవానంద్, యాదగిరియాదవ్, శ్రీశైలంయాదవ్, మాజీ ఏఎంసీ చైర్మన్ విజయ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింహగౌడ్, సుధాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, పృథ్వీరాజ్, శ్రీకాంత్, గణేశ్, పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.