సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్లెపల్లి శివారులో రహదారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన హరితహారం చెట్లు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో హరితహారం కార్యక్రమంలో నాటిన గుల్మెహర్ మొక్కలు ప్రస్తుతం చెట్లుగా మారి పూలు వికసించి, పచ్చదనంతో బాటసారులు, వాహనదారులకు కనువిందు చేస్తున్నాయి.