PV Narasimha Rao | శివ్వంపేట, జూన్ 28 : భారతదేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా శనివారం శివ్వంపేటలో కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి, సీనియర్ నాయకులు నవీన్ గుప్తా మాట్లాడుతూ.. దేశ ప్రధాని పదవిని అధిష్టించిన మొదటి ఒకే ఒక్క తెలుగువాడు పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి అనేక సేవలు అందించారని, మనందరం ఎంతో గర్వించాల్సిన విషయమని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాధవరెడ్డి, కమలా పూల్ సింగ్, వారాల గణేష్, సుధీర్ రెడ్డి, కాముని శ్రీనివాస్, గడ్డమీద కృష్ణ, షేక్ అలీ, గౌరీశంకర్‌తోపాటు పలువురు నాయకులు ఉన్నారు.
Harish Rao | తెలంగాణ వాది స్వేచ్ఛ అకాల మరణం ఎంతో బాధాకరం : హరీశ్‌రావు
Operation Sindhu | ఆపరేషన్ సింధు ద్వారా 4,415 మంది భారతీయుల్ని తరలించాం : కేంద్రం