చేగుంట, మే 26: చేగుంటలోని మండల పరిషత్ కార్యాలయంలో గతంలో ఇరుకైన గదులతో కార్యాలయం ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత ప్రభుత్వం నూతనంగా చేగుంట మండల పరిషత్ కార్యాలయాన్ని మంజూరు చేసి, అన్ని హంగులతో అన్ని కార్యాలయాలు ఒకేచోట నిర్మించింది.
అన్నిశాఖల అధికారులు అందుబాటులో ఉండడంతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయి. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.