MRO Balalakshmi | వెల్దుర్తి, మే 17: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తూకాన్ని వేగంగా చేయాలని తహసీల్దార్ బాలలక్ష్మి అన్నారు. ఇవాళ వెల్దుర్తిలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంతోపాటు శివసాయి రైస్‌మిల్లులను తహసీల్దార్ ఆర్ఐ నర్సింగ్యాదవ్తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా హమాలీలతో మాట్లాడిన తహసీల్దార్ ధాన్యం తూకం వేగంగా చేయాలని, వర్షాలు పడుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అలాగే ధాన్యం తడిసిపోవడంతో ఆరబెట్టడానికి కూలీలు అవస్థలు పడుతున్నారన్నారు. కావున వరుస క్రమంలో ధాన్యాన్ని తూకం వేసి వాహనాలలో రైస్‌మిల్లులకు తరలించాలని సూచించారు.
అలాగే రైస్‌మిల్లు యజమానులతో మాట్లాడుతూ..వాహనాలను రైస్‌మిల్లుల వద్ద నిలువ ఉంచుకోకుండా తగినంత మేర హమాలీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని త్వరత్వరగా దించుకొని రైతులకు సహకరించాలని సూచించారు.
Read Also :
Inmates Escaped: అమెరికా జైలు నుంచి 10 మంది ఖైదీలు పరారీ
Karimnagar Simha Garjana | కరీంనగర్ సింహ గర్జన.. ఉద్యమ రథసారథి కేసీఆర్ ప్రసంగం ఇదీ..
Tortoise | ఏకంగా వెయ్యి కిలోమీటర్లు ఈది.. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తాబేలు