Modi | టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న (విరోష్) రేపు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులకి వారు శుభలేఖలు పంపడం జరిగింది. అయితే విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు పంపిన వివాహ ఆహ్వానానికి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి, నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తన సందేశంలో దేవరకొండ, మందన్న కుటుంబాలకు అభినందనలు తెలియజేసిన ప్రధాని, ఈ వివాహాన్ని వారి జీవితాల్లో అందమైన కొత్త అధ్యాయానికి ఆరంభంగా పేర్కొన్నారు. జీవితాంతం స్నేహం, తోడ్పాటు, పరస్పర గౌరవం, అర్థం చేసుకోవడం వంటి విలువలపై నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. దాంపత్య జీవితం ప్రేమతో, కలలతో, పరస్పర గౌరవంతో నిండి ఉండాలని ఆశీర్వదించారు.
విజయ్, రష్మిక తమ జీవితంలో కొత్, సుందరమైన అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు మోదీ. సప్తపది అనే పవిత్ర సంప్రదాయంతో ఏడడుగులు కలిసి వేస్తూ జీవితంలో భాగస్వాములుగా మారుతున్నారని పేర్కొన్నారు. ఈ రాయల్ వెడ్డింగ్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న మెమంటో ఐటీసీ హోటల్లో జరుగనుంది. అత్యంత సన్నిహితుల మధ్య లావిష్‌గా కానీ ప్రైవేట్‌గా ఈ వేడుక నిర్వహించబడుతోంది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, నటి ఈషా రెబ్బా తదితరులు, అలాగే కొందరు రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతారని సమాచారం.
వివాహ ముహూర్తాన్ని అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఉదయం వేళల్లోనే రెండు సంప్రదాయాల ప్రకారం ప్రధాన తంతు జరుగుతుందని తెలుస్తోంది. తెలుగుతో పాటు కొడవ పెళ్లి సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరగనుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి విరోష్ వెడ్డింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ శుభాకాంక్షలతో ఈ వేడుక మరింత ప్రత్యేకత సంతరించుకుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.