మిరుదొడ్డి, అక్టోబర్ 23: ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులుచేయడం మానుకొని అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని దు బ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డితో పా టు చెప్యాల, అల్వాల, లింగుపల్లి, కాసులాబాద్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా నేటికీ గన్నీ బ్యాగులు కేటాయించలేదన్నారు. ధాన్యం నిల్వ చేయడానికి గోదాము లు లేవన్నారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం లో రైతులకు ఇబ్బందులు లేకుండా తగుజా గ్రత్తలు తీసుకొని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని గుర్తుచేశారు. జిల్లా అదనపు కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకొని రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే దుబ్బాక నియోజకవర్గంలో రైతులు అధికంగా వరిపం ట సాగుచేశారన్నారు. ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తూ రైతులకు రైతు భరోసా ఇవ్వలేదన్నారు. రైతులకు పంట రుణమాఫీ చేసిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు.
ప్రశ్నించిన ప్రతిపక్షనాయకులపై దాడులు చేయడం సరికాదన్నారు.మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా దుబ్బాక నియోజకవర్గంలోని ఏదు మండలా లు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మల్లన్నసాగర్ ప్రాజెక్టు పిల్ల కాల్వలను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించడానికి ప్రభు త్వం పంపుహౌస్‌లను నిర్మిస్తున్నదని, కానీ దుబ్బాక నియోజకవర్గంలోని పిల్ల కాల్వలు పూర్తి చేయడం లేదని మండిపడ్డారు.
మల్లన్నసాగర్ వల్ల నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్ల నిర్మాణానికి నయా పైసా ఇవ్వలేదన్నా రు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాజలింగారెడ్డి, ఎంపీడీవో గణేశ్‌రెడ్డి, ఏపీఎం దాక య్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అంజిరెడ్డి, ఏఎంసీ మాజీచైర్మన్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌లు బాల్‌రాజు, బాల్‌నర్సయ్య, బీఆ ర్ఎస్ నాయకులు లింగం, మల్లేశం, హైమ ద్, కుమార్, దిలీప్‌రెడ్డి పాల్గొన్నారు.