Oilpalm Subsidy | రామాయంపేట/తూప్రాన్, జూలై 14 : ఆయిల్ ఫామ్ మొక్కల సాగుతో అధిక దిగుబడి లభిస్తుందని ఈ పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీని కూడా ఇస్తాయని తూప్రాన్ మండల వ్యవసాయ శాఖ అధికారి గంగుమల్లు పేర్కొన్నారు. సోమవారం తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని పడాలపల్లి గ్రామంలో మేకల మల్లేశ్ వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ఫామ్ మొక్కలను నాటి మాట్లాడారు.
ఆయిల్ ఫామ్ సాగుకు చీడపీడల బెడద అసలే ఉండదన్నారు. ఒక్కసారి ఈ పంట విత్తుకుంటే రైతులకు 30 ఏళ్ల వరకు ఆదాయం లభిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బై బ్యాంకు పద్దతిలో కంపెనీ ఉత్పత్తిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోవడం వల్ల పంట కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు.
రైతులకు సబ్సీడీపై డ్రిప్ సిస్టంకు ఎస్టీ, ఎస్సీలకు వంద శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీని ఇస్తుందన్నారు.మండలంలోని ఆసక్తి గల వారు 8977725910లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో సంతోష్, కంపనీ ఫీల్డ్ ఆఫీసర్ నిశాంత్ తదితరులు ఉన్నారు.
Juluri Gourishankar | జూలూరి గౌరీశంకర్ రచించిన ‘బహుజనగణమన’ ఆవిష్కరణ
Student | అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత.. యమునా నదిలో శవమై తేలిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని