టొరంటో: కెనడాలోని పాఠశాలలో ఓ మహిళ జరిపిన కాల్పుల్లో 10 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బ్రిటిష్ కొలంబియాలోని టంబ్లర్ రిడ్జ్ పట్టణంలోని మాధ్యమిక పాఠశాల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఇటీవలి సంవత్సరాల్లో దేశంలో జరిగిన సామూహిక హత్యా ఘటనల్లో ఇది ఒకటని అధికారులు తెలిపారు. కాల్పుల తర్వాత నిందితురాలు కూడా కాల్చుకుని మరణించినట్టు భావిస్తున్నారు.