మంచిర్యాల, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి కోడ్ ఉల్లంఘించారు. చెన్నూర్ మున్సిపాలిటీలో బుధవారం ఓవైపు పోలింగ్ జరుగుతున్న క్రమంలోనే మంత్రి వివేక్ ఎన్నికల ప్రచారం చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెన్నూర్ పట్టణంలోని 4వ, 5వ వార్డులకు సంబంధించి ఎన్పీ (నల్లగొండ పోచమ్మ) వాడలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, అభ్యర్థులతో కలిసి బైక్‌పై తిరుగుతూ ప్రచారం చేశారు.
మంత్రి వివేక్ మధ్యాహ్నం 12.25 గంటల సమయంలో బైక్‌పై తిరుగుతూ ప్రచారం చేస్తూ కెమెరా కంటపడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంగళవారం కూడా ఇదే తరహాలో చెన్నూర్, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో తిరుగుతూ మంత్రి వివేక్ ప్రచారం చేశారు. ఆయన వ్యవహారంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.