పెద్దశంకంపేట : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, మహిళలకు అండగా టీఆర్ఎస్ ప్రభత్వం ఉంటుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. మొదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని రైతువేదిక భవనంలో కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన 56 మంది మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిరుపేద ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, మండల రైతుబంధు అధ్యక్షుడు సురేష్‌గౌడ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు, పీఎసీఎస్ వైస్ చైర్మన్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.