రైతన్నకు ఎంత బాధ!
‘రైతులను గింత ఇబ్బం ది పెడుతున్నరు. ఏ సార్లు వస్తలేరు... ఏంసెయ్యా లే... ఎవరూ పట్టించుకునేటోళ్లులేరు.. పోయిన నెల 12వ తేదీన వచ్చినం.. ఇప్పటి వరకు వడ్లుకొనలేదు. ఎన్నిమాట్లు అడిగినా కొనేటట్లు లేరు.. ఇంత ఇబ్బంది పెడుతున్నరు.
- 20 రోజులుగా ఎక్కడికక్కడ వడ్ల కుప్పలు
- అంతా బీగ్రేడ్తోనే కొనుగోళ్లు
- ఇబ్బందులు పడుతున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కర్షకులు
హుస్నాబాద్ టౌన్, మే 2: ‘రైతులను గింత ఇబ్బం ది పెడుతున్నరు. ఏ సార్లు వస్తలేరు… ఏంసెయ్యా లే… ఎవరూ పట్టించుకునేటోళ్లులేరు.. పోయిన నెల 12వ తేదీన వచ్చినం.. ఇప్పటి వరకు వడ్లుకొనలేదు. ఎన్నిమాట్లు అడిగినా కొనేటట్లు లేరు.. ఇంత ఇబ్బంది పెడుతున్నరు. బస్తాలు అడిగితే ఈరోజు ఇచ్చిండ్రు. ఎండల మేమే నింపుకొంటున్నం. ఏం సెయ్యాలే ఇదీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని రైతు జక్కుల ఎల్ల య్య రైతుగోస.. పైగా ధాన్యం ఏ గ్రేడ్ పేరుతో కొనుగోలు సైతం తగ్గించి బీ గ్రేడ్ పేరుతో కొనుగోలు చేస్తూ రైతులను ఆర్థికంగా నష్టపరుస్తున్నారు. పట్టణ పరిధిలోని ఆరపల్లిలో ఇరువైరెండు రోజులుగా ధాన్యం అమ్ముకునేందుకు వచ్చిన రైతులు ఎప్పుడు కొంటారా అని ఎదురుచూస్తున్న దయనీయమైన పరిస్థితికి నిదర్శనం.
తరలింపు అంతంతమాత్రమే
ఒకవైపు ప్రభుత్వం ధాన్యంకొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం కొనుగోళ్లు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ఆరపల్లి కేంద్రంలో దాదాపు ఐదువేలకుపైగా క్వింటాళ్ల ధాన్యం రాగా ఇప్పటివరకు కేవలం మూడు లారీలధాన్యం మాత్రమే తరలించారు.
అంతా బీ గ్రేడే…
గతంలో ఎన్నడూ లేనివిధంగా ధాన్యం కొనుగోళ్లలో సైతం అధికారులు, మిల్లర్లు ఒక్కటై రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం ఏ గ్రేడ్‌కు క్వింటాల్‌కు రూ. 2,389 కాగా, బీ గ్రేడ్ క్వింటాల్‌కు రూ. 2,369 మద్దతు ధర చెల్లిస్తున్నది. రైతుల ధాన్యం యాభైశాతంకంటే ఎక్కువగా బీగ్రేడ్ పేరుతోనే కొనుగోలు చేస్తుండటంతో క్వింటాల్‌కు రూ.20 వరకు నష్టపోతున్నారు. ఇప్పటికే 40 కిలోల బస్తాకు అదనంగా 1200 గ్రాముల ధాన్యాన్ని ఎక్కువగా తీసుకోవడంతో పాటు ఇలా క్వింటాల్‌కు రూ. 20ల వరకు కోతపెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

