కొంగొత్త ఆశయాలు.. నిర్ణయాలు.. వెరసి సంబురాలు..సంతోషాల మేళవింపుతో 2023 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు 2024 కొత్త సంవత్స రానికి స్వాగతం పలికారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత కేరింతల మధ్య నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్నారు. విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పార్టీలు చేసుకున్నారు. జిల్లా కేంద్రాలతో పాటు పట్టణాలు, మండల కేంద్రాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్‌షాప్‌లు న్యూ ఇయర్ కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. దీంతో కొనుగోలుదారులతో సందడిగా మారాయి. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కేక్‌లు కట్‌చేసి న్యూఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు.
కొంగొత్త ఆశయాలు.. నిర్ణయాలు.. వెరసి సరదాల సంబురాలు.. సంతోషాల మేళవింపులో నూతన సంవత్సరానికి స్వాగతం. నిన్న మనం సాధించలేనిది నేడు సాధించొచ్చు. రేపటిపై ఆశలు సజీవంగా ఉంచుతూ కొత్త పయనం మనం ఎంచుకున్న ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకుసాగాలి. కొంగొత్త ఆశయాలు.. నిర్ణయాలు.. వెరసి సరదాల సంబురాలు.. సంతోషాల మేళవింపులో నూతన సంవత్సరానికి స్వాగతం. నిన్న మనం సాధించలేనిది నేడు సాధించొచ్చు. రేపటిపై ఆశలు సజీవంగా ఉంచుతూ కొత్త పయనం మనం ఎంచుకున్న ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకుసాగాలి. 2023కు వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరానికి ఘనంగా స్వాగతం చెబుతూ ఉమ్మడి మెదక్ జిల్లా అంతటా సంబురాలు నిర్వహించారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత కేరింతల మధ్య నూతన సంవత్సర వేడుకలు వైభవంగా జరిగాయి. విద్యార్థులు, యువకులు పెద్దఎత్తున కేకులు కట్ చేస్తూ, పార్టీలతో సంబురాలు చేసుకున్నారు. హోటళ్లు, బేకరీల్లో న్యూ ఇయర్ కోసం ప్రత్యేక
ఆఫర్లతో వంటకాలు, కేకులను విక్రయించాయి. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా న్యూ ఇయర్ వేడుకల్లో ఆనందంగా గడిపారు.
నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి. పాడిపంటలు సమృద్ధిగా పండి రైతులందరూ ఆనందంగా వారి జీవితాలు గడపాలి. ఈ 2024 కొత్త సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలి. రేపటిపై ఆశలు సజీవంగా ఉంచుతూ కొత్త పయనం మనం ఎంచుకున్న ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకుసాగాలి.
2024 ఆంగ్ల సంవత్సరంలో సిద్దిపేట జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి. రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలి. యువత మంచి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని, విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించాలి. 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో అన్ని వర్గాలకు శుభాలతోపాటు విజయాలు చేకూరాలి. సిద్దిపేట జిల్లా ప్రజలతోపాటు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
2024 సంవత్సరం మెదక్ ప్రాంత ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి. ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలి. ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలి. విద్యార్థులు, యువత నూతన లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని, వాటిని చేరుకునేలా ప్రయత్నించాలి. 2023కు వీడోలు పలుకుతూ, 2024లోకి అడుగుపెడుతున్న వేళ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురసరించుకుని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు. 2024 ఏడాది ప్రతిఒకరికీ శుభాలు చేకూర్చాలి. ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలి. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలి. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలతో ముందుకు సాగాలి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కొత్త సంవత్సరంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ జిల్లాను మరింత వడివడిగా ప్రగతి పథాన పయనింపజేసేందుకు కలిసికట్టుగా కృషిని కొనసాగిద్దాం.
గజ్వేల్, డిసెంబర్ 31: ఐదు రూపాయల ఐదు వేల నాణేలతో 2024ను రామకోటి భక్తసమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామరాజు రూపొందించి శుభాకాంక్షలు తెలిపారు.
బొల్లారం మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాష పండితుడు అడ్డాడ శ్రీనివాస్‌రావు అరచేతిలో ఇమిడే క్యాలెండర్‌ను రూపొందించారు. గణిత పరిజ్ఞానంతో విద్యార్థుల కోసం తయారు చేసినట్లు ఆయన తెలిపారు.