మెదక్ మున్సిపాలిటీ : స్వర్ణకారులు ( Goldsmiths ) సంఘటితంగా ముందుకు సాగాలని స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు పూన రవిచారి (Ravi Chari) పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కాళీకాదేవి ఆలయంలో శనివారం ఆలయ నూతన కమిటీతో పాటు వయోజన, యువజన కమిటీల ప్రమాణ స్వీకరోత్సవానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణకార వృత్తిలో కార్పొరేట్ రంగాల ప్రవేశంతో స్వర్ణకారుల జీవితాలు ఆయోమయంగా మారయన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేద స్వర్ణకారులను, విశ్వకర్మలను ఆదుకోలవాలని కోరారు. ఈ సందర్భంగా కమిటీల బాధ్యులను శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం రాష్ట్ర కార్యదర్శి నిమల్లి శ్రీనివాస్, కామారెడ్డి, రామాయంపేటల స్వర్ణకార సంఘాల అధ్యక్షులు చక్రం చారి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.