పటాన్చెరు, సెప్టెంబర్ 22 : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు, వైజాగ్ ఎంపీ శ్రీభరత్ మతుకుమిల్లి తెలంగాణ వరద సహాయక చర్యలకు మద్దతుగా సీఎం సహాయనిధికి రూ. కోటి అందజేశారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసం లో ఆయన్ను కలిసి చెక్కును అందజేశారు. గీతం ఉద్యోగులు సైతం ఒకరోజు వేత నం సీఎం సహాయనిధికి ఇచ్చారు.
గీతం అధ్యక్షుడికి సీఎం రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపా రు. కొద్ది రోజుల క్రితం ఏపీలోని వరద బాధితుల సహాయక చర్యలకు మద్దతుగా రూ. కోటి విరాళం అందజేశారు. సామాజిక బాధ్యతగా ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఆర్థికంగా, ఇతర సహాయ చర్యలకు అండగా ఉం టుందని శ్రీభరత్ పేర్కొన్నారు. కార్యక్రమం లో పూర్వ ఐఏఎస్ అధికారి, గీతం ముఖ్య పరిపాలానాధికారి బీఆర్ మీనా, గీతం హైదరాబాద్ ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ డీన్ సయ్యద్ అక్బరుద్దీన్, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ పాల్గొన్నారు.