నిజాంపేట,అక్టోబర్ 16 : మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామలో లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మీనాక్షి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని గురువారం ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు డాక్టర్ మోహన్ నాయక్ స్వయంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు.
ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లద్ద ప్రీతి, గ్రామ అధ్యక్షుడు అంజిరెడ్డి, ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు రుషికేష్ యాదవ్, లింగు స్వామి, రాజు నాయక్, ఆశ వర్కర్ గౌరీ తదితరులు పాల్గొన్నారు.