సిద్దిపేట, ఏప్రిల్19: క్యాన్సర్‌ను మొదటి దశలో గుర్తిస్తే నివారించవచ్చని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని విపంచి ఆడిటోరియంలో కిమ్స్ దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇతర దేశాల కంటే మన దేశంలోనే క్యాన్సర్ రోగుల సంఖ్య ఎకువగా పెరుగుతుందన్నారు. ప్రతి పదిమంది పేషంట్లను పరీక్షిస్తే ఇద్దరు లేదా ముగ్గురికి క్యాన్సర్ ఉంటుందన్నారు. వైద్యరంగంలో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ క్యాన్సర్‌ను పూర్తిగా జయించలేకపోయమన్నారు.
క్యాన్సర్ అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందన్నారు. మధ్యవయస్సు వారందరూ తప్పకుండా తరచూ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో ఇలాంటి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా ముందుకు వచ్చి ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలన్నారు.సిద్దిపేటలో కిమ్స్ దవాఖాన వారు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.వైద్యులు శ్రవణ్‌కుమార్‌రెడ్డి, దేవరశెట్టి మధు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పాల సాయిరామ్, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, పూజల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.