నాటి,నేటి ప్రభుత్వాల లక్ష్యం ఒక్కటే
అవసరమైన చోట పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఈ విషయంలో బీఆర్ఎస్,కాంగ్రెస్ ప్రభుత్వాల లక్ష్య ం ఒకటే అని రాష్ట్ర శాసనసభా వ్యవహారాలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
- శాసనసభా వ్యవహారాలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట శివారులో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌కు భూమిపూజ
సిద్దిపేట, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ నంగునూరు : అవసరమైన చోట పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఈ విషయంలో బీఆర్ఎస్,కాంగ్రెస్ ప్రభుత్వాల లక్ష్య ం ఒకటే అని రాష్ట్ర శాసనసభా వ్యవహారాలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామ శివారులో జునో జూల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, రాజ్యసభ సభ్యులు,
సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ ఛైర్మన్ భువనేశ్వరి కలిత, ఎంపీలు ఎస్కే ప్రేమ్ చందర్, సంతోష్ బగ్రోడియా, మాజీ ఎంపీలు సాంబశివరావు, వి.హనుమంతరావు, జునోజూల్ బయో ఫ్యూయల్స్ కంపెనీ సీఈవో రాయపాటి శరత్, ఇతర ప్రముఖులతో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు భూమిపూజ నిర్వహించారు.రూ. 700 కోట్లతో ఈ ప్రాజెక్టును మూడు దశల్లో నిర్మా ణం చేపడుతారు. తొలి దశలో 3 ప్లాంట్ల సామర్ధ్యంతో 30 టీపీడీ రూ. 210 కోట్లతో ఆదివారం భూమి పూజ చేశారు. దీని తర్వాత రెండోది రూ. 210 కోట్లు, మూడోది రూ. 280 కోట్లతో చేపడుతారు. మొదటిది డిసెంబర్‌లోగా పూర్తి చేయాలనే లక్ష్యం.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మం త్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ పరిసరాల్లోనే కాకుండా జిల్లాలు, గ్రామీ ణ ప్రాంతాలకు పరిశ్రమలు వచ్చినప్పుడు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు స్థానికులు సహకరిస్తే, ఉపాధి అవకాశాలు దొరుకుతాయ ని మంత్రి అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేపట్టిందని, పరిశ్రమలు ఏర్పాటవుతున్నట్లు మం త్రి తెలిపారు. సీఈవో శ్రీనాగశరత్ రాయపాటి మాట్లాడుతూ.. దేశ స్వచ్ఛమైన, స్వావలంబన కలిగిన ఇంధన రంగపు తదుపరి దశ నిర్మాణ దిశగా ఒక కీలకమైన ముందడుగుగా నిలిచే ఈ ప్రాజెక్టుకు భూమిపూజల చేయడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

