రామచంద్రాపురం, సెప్టెంబర్ 6: వరదలతో విలవిలలాడుతున్న రెండు తెలుగు రాష్ర్టాలకు మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి రూ. రెండు లక్షల ఆర్థిక సాయం అందజేశా రు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆదర్శ్‌రెడ్డికి (తెలంగాణ) రూ. లక్ష, (ఆంధ్రప్రదేశ్)కు రూ.లక్ష అందజేయాలని చెక్కులు ఇచ్చారు.
భూపాల్‌రెడ్డి అందజేసిన చెక్కులను రెండు రాష్ర్టాల్లో తీవ్రంగా నష్టపోయిన జిల్లాలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరదసాయం గా ఆదర్శ్‌రెడ్డి అందజేస్తారు. ఈ సందర్భం గా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రెండు రాష్ర్టా ల్లో భారీగా కురిసిన వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూడు, గూడు కోల్పోయిన ప్రజల కు అందరం అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీగా సాయం చేయాలన్నారు.
విపత్కర పరిస్థితిలో ప్రతిఒక్కరూ బాధితులను ఆదుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకుడు ఆదర్శ్‌రెడ్డి మాట్లాడుతూ భూపాల్‌రెడ్డి సాయం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. కష్టకాలంలోనే ప్రతి ఒక్కరూ మానవత్వం చూపాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నా యకులు కుమార్‌గౌడ్, జగన్నాథ్‌రెడ్డి, బీఆర్ఎస్వీ కోఆర్డినేటర్ కృష్ణకాంత్, మైనార్టీ నాయకులు అజీముద్దీన్, గౌస్, విష్ణువర్ధన్‌రెడ్డి, మహేందర్ పాల్గొన్నారు.