హుస్నాబాద్, అక్టోబర్ 20: ఎన్నికలకు ముందు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, రూ.15వేల రైతు భరోసా ఇస్తామని, కౌలు రైతులకూ భరోసా కల్పిస్తామనే హామీలు ఇచ్చి తీరా గెలిచిన అనంతరం ఇచ్చిన హామీలను విస్మరిస్తూ రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడుతున్నదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు.
ఆదివారం హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సతీశ్‌కుమార్ మాట్లాడుతూ.. వానకాలానికి సంబంధించిన రైతు భరోసా ఇక రాదని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించడం రైతులను ఘోరంగా మోసం చేయడమేనని అన్నా రు. రుణమాఫీ చేయకుండా, రైతు భరోసా ఇవ్వకుండా మాటలతో పబ్బం గడుపుతున్న రేవంత్‌రెడ్డి సీఎం పదవి నుంచి గద్దె దిగాలని డిమాండ్ చేశారు.
ఆందోళనలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనితారెడ్డి, మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, మాజీ ఎం పీపీ లకావత్ మానస, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, నాయకులు ఎడబోయిన రజనీతిరుపతిరెడ్డి, అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, బండి పుష్ప, వాల నవీన్‌రావు, బొజ్జ హరీశ్, వంగ వెంకట్రాంరెడ్డి, యాటకార్ల స్వరూప, విజయభాస్కర్, బాషవేని రాజయ్య, అయూబ్, రవీందర్‌గౌడ్, మాధవరెడ్డి, వెంకటేశ్, ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.