హుస్నాబాద్, అక్టోబర్ 26: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యు త్ చార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపాలని చూ స్తున్నదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ శనివారం ప్రకటనలో ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ప్రజలపై భారం మోపుతున్నదని, 200 యూనిట్లు దాటితే గతంలో ఉన్న రూ.10 ఫిక్స్డ్ చార్జీలను రూ.50కి పెంచుతూ ప్రభు త్వం నిర్ణయం తీసుకోవడం ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమే అని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగానికి 24గంటల ఉచిత విద్యుత్ అందించి రూ. 1200కోట్ల సబ్సిడీని ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. గృహలక్ష్మి పథకం పెట్టి చార్జీలు పెంచడం కాంగ్రెస్ చిత్తశుద్ధికి నిదర్శనమని, ప్రజలు చైతన్యవంతులై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఉద్యమించాల్సిన అవస రం ఉందని పేర్కొన్నారు. ఆనా డు కరెంటు చార్జీల పెంపుతోనే తెలంగాణ ఉద్యమం పుట్టిందని, ఈనాడు మళ్లీ చార్జీలు పెంచి కాం గ్రెస్ ప్రభుత్వం మరో ఉద్యమానికి ఊపిరిపోయనుందని తెలిపారు.
కేసీఆర్ పాలనలో అటు రైతులు, ఇటు ప్రజలు ఎలాంటి కరెంటు కష్టాలు లేకుండా జీవ నం కొనసాగించారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లో కరెంటు కోతలు, విద్యు త్ చార్జీల పెంపుతో ప్రజ లు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలపై రూ.18వేల కోట్ల భారం మోపేందుకు కుట్రలు జరుగుతున్నాయని, వీటిని ప్రజలందరూ ఐక్యంగా ఉండి పోరాడాల్సిన అవస రం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోకుంటే ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని మా జీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ హెచ్చరించారు.