మెదక్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం పొంతనలేని మాట లు చెబుతూ రైతన్నలను మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు.అంతకుముందు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ ఆంజనేయులు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు కలిసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ధర్నాలో పాల్గొన్నారు.
రైతుల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. అమలు కానీ హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ప్రజలను భ్రమలో పెట్టి ఓట్లు వేయించుకుందని అన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, కో కన్వీనర్లు గడ్డమీద కృష్ణాగౌడ్,
లింగారెడ్డి, కండెల సాయిలు, జుబేర్ అహ్మద్, మున్సిపల్ కౌన్సిలర్లు ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, విశ్వం, రాజు, శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు మాయ మల్లే శం, చంద్రకళ, మెదక్, చిన్నశంకరంపేట్, పాపన్నపేట మండలాల పార్టీ అధ్యక్షులు అంజాగౌడ్, రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ బాలాగౌడ్, మాజీ మండల రైతు బంధు అధ్యక్షులు గడిల శ్రీనివాస్ రెడ్డి, నర్సారెడ్డి, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.