మెదక్ రూరల్ అక్టోబర్ 10 : మెదక్ మండలం ఖాజీపల్లి గ్రామానికి చెందిన కాండ్ర యేసు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మెదక్ బీఆర్ఎస్ మండల నాయకులు కిష్టయ్య, ఖాజీపల్లి వెంకట్రావు యేసు కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన పద్మ దేవేందర్ రెడ్డి యేసు కుటుంబ సభ్యులకు రూ.5 వేల ఆర్థిక సాయం చేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని యేసు కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. కార్యక్రమంలో వీరబోయిన కిషన్, నాగరాజుగౌడ్, గొర్రె సత్తయ్య, గొర్రె నరేందర్ రెడ్డి, మిజ్జపల్లి నర్సింలు తదితరులు ఉన్నారు.