మెదక్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లాలో వర ద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి హరీశ్‌రావు బృందంపైన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఖమ్మం లో బీఆర్ఎస్ ప్రతినిధులపై జరిగిన దాడిని ఖండిస్తూ బుధవా రం మెదక్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మె ల్సీ శేరి సుభాష్ రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ వరదలను రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. వరద బాధితులను పరామర్శించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఖమ్మం జిల్లాకు వెళ్తే అక్క డ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ప్రతినిధులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ప్రభుత్వం కేసీఆర్‌ను నిందించడమే పనిగా పెట్టుకుందన్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు వరద బాధితులకు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఅర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక నెల వేతనాన్ని విరాళంగా అందిస్తున్నామని ప్రకటించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఖమ్మం వెళ్లి తూతూమంత్రంగా వరద బాధితులను పరామర్శించి వచ్చారు తప్ప వారిని ఆదుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ బృందం మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఇంటిం టా తిరుగుతూ వారి కష్టాలు తెలుసుకున్నారని, వారి ఇబ్బందులు గమనించి అత్యవసరంగా నిత్యావసరాలు అందజేశారని గుర్తుచేశారు.
దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ… అధికారంలో ఉన్నప్పుడు వరద బాధితులను ఏ విధంగా ఆదుకున్నామో అదేవిధంగా సహాయం చేయాలన్నారు. ప్రతిపక్షం లో ఉన్న వారు పరామర్శిస్తుంటే దాడి చేయడాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ…వాతావరణ శాఖ హెచ్చరిక చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి ఇంత విపత్తుకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని విమర్శించారు. సమావేశంలో బట్టి జగపతి, లావ ణ్యరెడ్డి, లింగారెడ్డి, జుబేర్ అహ్మద్, కండెల సాయిలు, జయరాజు, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్‌రెడ్డి, బాలాగౌడ్, లింగం, జగన్, నరేందర్ రెడ్డి, రంజా, ఇస్మాయిల్, మోహన్, నవీన్, అమీర్, వేణు తదితరులు పాల్గొన్నారు.