జొన్నల కొనుగోలులో ప్రభుత్వం విఫలం
జొన్నల కొనుగోలులో ప్ర భుత్వం పూర్తిగా విఫలమైందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కంగ్టిలో పీఏసీఎస్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఇంకా మండలంలో 50శాతం కూడా జొన్నల కొనుగోలు పూర్తికాలేదన్నారు.
- నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి విమర్శ
కంగ్టి, జూన్ 14 : జొన్నల కొనుగోలులో ప్ర భుత్వం పూర్తిగా విఫలమైందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కంగ్టిలో పీఏసీఎస్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఇంకా మండలంలో 50శాతం కూడా జొన్నల కొనుగోలు పూర్తికాలేదన్నారు. సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో ఇంకా చాలామంది రైతులు టోకెన్ల కోసం కార్యాలయం ఎదుట బా రులు తీరుతున్నారని అన్నారు.
ప్రభుత్వం ఆధార్ వెరిఫికేషన్ కోసం కొత్తగా థంబ్ నిబంధ న పెట్టడంతో మహిళలు, వృద్ధులు సైతం కార్యాలయం ఎదుట పడికాపులు కాస్తున్నారని విమర్శించారు. రైతులకు అందుబాటులో గన్నీబ్యాగ్‌లు లేకపోవడంతో సొంత డబ్బులతో కొనుక్కుకుంటున్నారని తెలిపారు. లారీల కొరత వెం టాడంతో కొంతమంది రైతులు కలిసి లారీలను అద్దెకు తీసుకుని కొనుగోలు కేంద్రాలకు తమ జొన్నలను తరలిస్తున్నారని, జొన్నల కొనుగోలు చేతకాకనే ప్రభుత్వం రైతులను నిబంధనల పేరిట ఇబ్బందులు పెడుతుందన్న ఆయన విమర్శించారు.
కార్యాలయం లో కేవలం రెండు సిస్టమ్‌లు ఉండడంపై మాజీ ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. దీంతో టోకెన్లు, బిల్లుల అందడం లో జాప్యం జరుగుతున్నదని తెలిపారు. అదనం గా ఇంకా కొన్ని సిస్టమ్‌లను అందుబాటులోకి తెచ్చి, రైతులకు సకాలంలో బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని సీఈవో రమేశ్‌కు సూచించారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ డిక్లరేషన్‌లో భాగంగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీపీ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ కృష్ణముదిరాజ్, బీఆర్ఎస్ నాయకులు రాజేందర్, గూలే సతీశ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

