హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టానికి గత పదేండ్లలో పీఎంఎంవై రుణాలు రూ.2.79 లక్షల కోట్లకు చేరినట్టు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రాధాన్యత రంగాల రుణాలు, పీఎంఎంవై, స్టాండప్ ఇండియా పథకాల అమలు, నిధుల మంజూరు వివరాలను లోక్సభలో కేంద్రం వెల్లడించింది. నిజామాబాద్ ఎంపీ అర్విం ద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.