ఔట్‌బేసిన్‌కు కృష్ణా జలాలు తరలించవచ్చు
ఔట్‌బేసిన్‌కు కృష్ణా జలాలను తరలించవచ్చని ఆంధ్రప్రదేశ్ వితండవాదానికి దిగుతున్నది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఈ మేరకు వాదనలు వినిపిస్తున్నది.
- ట్రిబ్యునల్‌లో ఆంధ్రప్రదేశ్ వాదనలు
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఔట్‌బేసిన్‌కు కృష్ణా జలాలను తరలించవచ్చని ఆంధ్రప్రదేశ్ వితండవాదానికి దిగుతున్నది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఈ మేరకు వాదనలు వినిపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెక్షన్-3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ ఢిల్లీలో బుధవారం జరిగింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర ఎదుట ఏపీ తన గత వాదనలు కొనసాగించింది. క్యారీ ఓవర్ స్టోరేజ్ కింద 80 టీఎంసీలు ఉంచి, 70 టీఎంసీలను ఇన్బేసిన్ అవసరాలకు పంచాలని గతంలో తెలంగాణ చేసిన వాదనలను ఖండించింది. 150 టీఎంసీలను క్యారీ ఓవర్‌గానే ఉంచాలని, 299:512 నిష్పత్తిలోనే జలాలను పంచాలని నివేదించింది. జూ న్, జూలై అవసరాలకు జలాలను ఇవ్వ డం కుదరదని, నీటి కేటాయింపు మొత్తం ఏడాదికి సంబంధించిన అంశమని, ఔట్బేసిన్కూ జలాలను తరలింవచ్చని, ఇన్బేసిన్కే తరలించాలని తెలంగాణ చేసిన వాదనలు తప్పని వాదించింది. పోతిరెడ్డిపాడుపై ఆంక్షలు పెట్టడానికి వీల్లేదని, సర్ప్లస్ జలాలను స్టోరేజ్ చేసుకోవడానికి తమకు అనుమతులు, హకులూ ఉన్నాయని ఏపీ తెగేసి చెప్పింది. రాయలసీమ లిఫ్ట్‌పై ప్రస్తుతమున్న స్టేటస్కో తాత్కాలికమేనని, భవిష్యత్తులో కట్టితీరుతామని, కేటాయింపుల మేరకు నీళ్లను మళ్లించుకుంటామని తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

