Railway tracks | రైలు పట్టాలపై నిలిచిన లారీ.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
Railway tracks | పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి - కూనారం ఆర్వోబీ వద్ద రైల్వే పట్టాలపై(Railway tracks) లారీ నిలిచిపోవడంతో కాసేపు హైటెన్షన్ నెలకొన్నది.
పెద్దపల్లి, జూలై 22: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి – కూనారం ఆర్వోబీ వద్ద రైల్వే పట్టాలపై(Railway tracks) లారీ నిలిచిపోవడంతో కాసేపు హైటెన్షన్ నెలకొన్నది. బుధవారం రాత్రి కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ( Lorry)పెద్దపల్లి – కూనారం ఆర్వోబీ వద్దకు వచ్చింది. అయితే రైలు పట్టాల మధ్య ఎగుడు దిగుడు ఉండడం, లారీ అధిక లోడ్‌తో ఉండడం వల్ల ముందుకు కదల్లేకపోయింది.
వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై పలు రైళ్లను నిలిపి వేశారు. స్థానికుల సాయంతో లారీని ముందుకు తోసేందుకు ప్రయత్నించగా, ఎంతకి కదల్లేదు. చివరగా క్రేన్ సాయంతో పట్టాలపై నుంచి లారీని ముందుకు తీసుకెళ్లారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా ఇటీవల పట్టాల మరమ్మతులు సరిగ్గా చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

