మెదక్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): మెదక్ చర్చి శత వసంతాలకు సోమవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు రానున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ఉదయం 11.30 గంటలకు మెదక్ చర్చిలో జరిగే శత వసంతాల వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.